ఢిల్లీ గెలుపు జోరు..మళ్లీ ఓడిన యూపీ వారియర్స్‌‌

ఢిల్లీ గెలుపు జోరు..మళ్లీ ఓడిన యూపీ వారియర్స్‌‌

వడోదర : విమెన్స్ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌ (డబ్ల్యూపీఎల్‌‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ రెండో విజయం సాధించింది.  యూపీ వారియర్స్ వరుసగా రెండోసారి ఓడింది. కెప్టెన్  మెగ్ లానింగ్ (49 బాల్స్‌‌లో 12 ఫోర్లు), అనాబెల్‌‌ సదర్లాండ్ (34 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 41 నాటౌట్‌‌) సూపర్ బ్యాటింగ్‌‌తో  బుధవారం జరిగిన మ్యాచ్‌‌లో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో వారియర్స్‌‌ను ఓడించింది. తొలుత యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 166/7 స్కోరు చేసింది. ఓపెనర్ కిరణ్​ నవ్‌‌గిరె (27 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 51) ఫిఫ్టీతో ఆకట్టుకోగా.. శ్వేత సెహ్రావత్ (37), చినెల్లే హెన్రీ (33 నాటౌట్‌‌) రాణించారు.  

కెప్టెన్ దీప్తి శర్మ (7), తహ్లియా మెక్‌‌గ్రాత్ (1) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్‌‌ సదర్లాండ్‌‌ రెండు, మరిజేన్ కాప్‌‌, జొనాసెన్‌‌, అరుంధతి, మిన్ను మణి ఒక్కో వికెట్‌‌ పడగొట్టారు. తర్వాత ఢిల్లీ 19.5 ఓవర్లలో 167/3 స్కోరు చేసి గెలిచింది. మరిజేన్ కాప్‌‌ (29 నాటౌట్‌‌) కూడా రాణించింది. లానింగ్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గురువారం జరిగే మ్యాచ్‌‌లో ముంబై, ఆర్‌‌‌‌సీబీ తలపడతాయి.