IPL 2025: పాంటింగ్‌‌ను తప్పించిన ఢిల్లీ.. దాదా ద్విపాత్రాభినయం!

IPL 2025: పాంటింగ్‌‌ను తప్పించిన ఢిల్లీ.. దాదా ద్విపాత్రాభినయం!

వచ్చే ఏడాది టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా మొదట ప్రధాన జట్టు కోచ్ ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌కు ఉద్వాసన పలికింది. అతనితో బంధాన్ని తెంచుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పాంటింగ్.. ఏడేళ్ల పాటు ఢిల్లీకి తన సేవలు అందించారు. ఈ ఏడేళ్ల కాలంలో అతని శిక్షణలో క్యాపిటల్స్ ఒకసారి టైటిల్ గెలవలేకపోయింది. ఈ క్రమంలోనే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

2021 సీజన్‌లో ఫైనల్ 

పాంటింగ్ శిక్షణలో ఢిల్లీ క్యాపిటల్స్ 2021 ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ చేరింది. అయితే, టైటిల్ గెలవడంలో విఫలమయ్యారు. తుది పోరులో ముంబై చేతిలో చిత్తయ్యారు. ఆసీస్ దిగ్గజం కాలంలోనూ, ఐపీఎల్ చరిత్రలోనూ అదే వారి అత్యుత్తమ ప్రదర్శన. 2024 సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ.. గత మూడు ఎడిషన్‌లలో ప్లేఆఫ్‌కు అర్హత సాధించడానికి కూడా చాలా కష్టపడింది. 2023లో తొమ్మిది, 2022లో ఐదు, 2021లో మూడు, 2019లో మూడు, 2018లో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

దాదా ద్విపాత్రాభినయం

జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, కెప్టెన్ రిషబ్ పంత్ వారి పాత్రలలో కొనసాగే అవకాశం ఉంది. వీరిద్దరికి సంబంధించి ఫ్రాంచైజీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే కొనసాగుతుండగా, అవసరమైతే గంగూలీ అదనపు కోచింగ్ బాధ్యతలను చేపట్టవచ్చన్న మాటలు వినపడుతున్నాయి. అదే జరిగితే, దాదా ద్విపాత్రాభినయం చేయనున్నారు.

ALSO READ | IND vs SRI: క్రికెట్ అభిమానులకు అలెర్ట్.. శ్రీలంక పర్యటన షెడ్యూల్‌లో మార్పులు