
WPL Final మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఆదిలోనే ముంబైని లేవలేని దెబ్బకొట్టింది. బౌలర్ మారిజన్ కప్ విజృంభించడంతో పవర్ ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది ముంబై. ఓపెనర్ హేలీ మథ్యూ్స్ 3 రన్స్ కే క్లీన్ బౌల్డ్ అయిన కాసేపటికే.. యాస్తికా భాటియా 8 రన్స్ చేసి కప్ బౌలింగ్ లో జెమీమా రోట్రిగ్జ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకుంది. దీంతో భారీ అంచనాలతో గ్రౌండ్ లోకి దిగిన ముంబై డిఫెన్స్ లో పడినట్లైంది.
ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సివర్ బ్రంట్ (28 బాల్స్ లో 30 రన్స్, 10 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (44 బంతులలో 66 రన్స్, 9 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతమైన పార్ట్నర్షిప్ తో స్కోర్ బోర్డును గౌరవప్రదమైన స్కోర్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అమెలియా కౌర్, సజన, కమిలిని.. ఇలా ఏ ఒక్కరూ క్రీజ్ లో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 149 రన్స్ మాత్రమే చేయగలిగింది. మిగతా బాటర్ల సప్పోర్ట్ లేకపోవడంతో ఢిల్లీకి 150 రన్స్ టార్గెట్ మాత్రమే ఇవ్వ గలిగింది.
Also Read:-ముంబై ఇండియన్స్కు మూడు ఓవర్లకే ముచ్చెమటలు పట్టించిన ఢిల్లీ క్యాపిటల్స్
ఇక ఢిల్లీ బౌలర్లలో కప్ విజృంభించింది. 4 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీసి కేవలం 11 రన్స్ మాత్రమే ఇచ్చింది. ఆదిలోనే ఇద్దరిని పెవిలియన్ పంపించి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇక జెస్ జొనాస్సెన్, నల్లపురెడ్డి చరణి ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
హర్మన్ ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్:
మ్యాచ్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి స్కోర్ ను డిఫెండబుల్ స్థాయికి తీసుకొచ్చింది. సివర్ బ్రంట్ సహకారంతో స్కోర్ కార్డును పరుగులు పెట్టించింది. ఒకవైపు వికెట్లను కాపాడాలని జాగ్రత్తగా ఆడుతూనే లూస్ బాల్స్ ను కఠినంగా పనిష్ చేసింది. స్ట్రైక్ దాదాపు తనవైపు ఉంచుకుని స్కోర్ బాధ్యతను ఒంటరిగా మోసిందనే చెప్పాలి. మొత్తం 44 బంతులు ఆడిన హర్మన్ 9 ఫోర్లు, 2 సిక్సులతో విరుచుకుపడి 66 రన్స్ చేసి సుదర్లాండ్ బౌలింగ్ లో కప్ కు క్యా్చ్ ఇచ్చి వెనుదిరిగింది.
ఆ తర్వాత సీనియర్ ప్లేయర్ బ్రంట్ కూడా బాధ్యతా యుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించింది. మొత్తం 28 బాల్స్ లో 10 ఫోర్లు కొట్టి 30 రన్స్ చేసి చరణి బౌలింగ్ లో మణికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. వీళ్లిద్దరు పోరాటంతో ఢిల్లీ ముందు 150 రన్స్ టార్గెట్ ఉంచింది. చూడాలి మరి.. ఢిల్లీ గెలుస్తుందా లేక కప్ ముంబైని వరిస్తుందా అనేది.