న్యూఢిల్లీ : ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తన కోచింగ్ స్టాఫ్‌ను గురువారం ప్రకటించింది. తెలుగు క్రికెటర్ వేణుగోపాల్ రావును క్రికెట్ డైరెక్టర్‌గా నియమించింది. టీమిండియా మాజీ ప్లేయర్ హేమంత్ బదానీకి హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు ఇచ్చింది. జేఎస్‌డబ్ల్యూలో ఉన్న అన్ని క్రికెట్ జట్ల వ్యవహారాలను దాదా పర్యవేక్షించనున్నాడు.