DC vs LSG: అశుతోష్ శర్మ అసాధారణ ఇన్నింగ్స్.. ఓడిపోయే మ్యాచ్‌లో లక్నో పై గెలిచిన ఢిల్లీ

DC vs LSG: అశుతోష్ శర్మ అసాధారణ ఇన్నింగ్స్.. ఓడిపోయే మ్యాచ్‌లో లక్నో పై గెలిచిన ఢిల్లీ

ఐపీఎల్ సీజన్ 18 లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని అందుకుంది. అశుతోష్ శర్మ(66, 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ తో లక్నో సూపర్ జయింట్స్ తో చివరి వరకు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. వైజాగ్ వేదికగా అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరో వరకు విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. చివరి ఓవర్లో అశుతోష్ శర్మ సిక్సర్ కొట్టి ఢిల్లీకి థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లను 211 పరుగులు చేసి గెలిచింది.    

ALSO READ | DC vs LSG: పూరన్, మార్ష్ విధ్వంసం.. ఢిల్లీ ముందు బిగ్ టార్గెట్

210 పరుగులు భారీ లక్ష్యంతో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి 10 బంతుల్లోనే 3 వికెట్లను కోల్పోయింది. తొలి ఓవర్ లోనే శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్(1), అభిషేక్ పోరెల్(0) తొలి ఓవర్ లోనే ఔటయ్యారు. రెండో ఓవర్ లో స్పిన్నర్ సిద్ధార్ధ్ మరో షాక్ ఇచ్చాడు. సమీర్ రిజ్వి (4)ని పెవిలియన్ కు పంపాడు. ఈ దశలో డుప్లెసిస్(29), అక్షర్ పటేల్(22) కాసేపు మెరుపులు మెరిపించారు. పవర్ ప్లే ముందు అక్షర్ పటేల్.. ఆ తర్వాత డుప్లెసిస్ వికెట్లను కోల్పోయింది. దీంతో ఢిల్లీ 65 పరుగులకే 5 వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఓటమి ఖామనుకున్న దశలో స్టబ్స్, అశుతోష్ శర్మ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. 6 వికెట్ కు 48 పరుగులు జోడించి  పరిస్థితిని చక్కదిద్దారు. 

స్టబ్స్(34) ఔటైన తర్వాత విప్రజ్ నిగమ్ పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చాడు. 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి లక్నోని వణికించాడు. ఈ దశలో వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ  ఓటమి ఖాయమనుకున్నారు. అయితే అశుతోష్ శర్మ శర్మ అసాధారం ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. 31 బంతుల్లోనే 66 పరుగులు చేసి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సిద్దార్ధ్, రాత్, బిష్ణోయ్ తలో రెండు వికెట్ల తీసుకున్నారు.     

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ భారీ స్కోర్ చేసింది. పూరన్, మిచెల్ మార్ష్ ల విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 30 బంతుల్లోనే 7 సిక్సర్లు.. 6 ఫోర్లతో 75 పరుగులు చేసిన పూరన్ టాప్ స్కోరర్ గా  నిలిచాడు. మరో ఎండ్ లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు.. 6 సిక్సర్లతో 72 పరుగులు చేసి దుమ్ములేపాడు. లక్నో బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా.. ముకేశ్, నిగమ్ లకు తలో వికెట్ లభించింది.