DC vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ముగ్గురు స్పిన్నర్లతో కోల్‌కతా

DC vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ముగ్గురు స్పిన్నర్లతో కోల్‌కతా

ఐపీఎల్ 2025 లో మంగళవారం (ఏప్రిల్ 29) కీలక సమరం జరగబోతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో ఢీలా పడిన కోల్‌కతాకు ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ లో గెలిచి టేబుల్ టాపర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. ఢిల్లీ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. కేకేఆర్ విషయానికి వస్తే చేతన్ సకారియా స్థానంలో స్పిన్నర్  అనుకుల్ రాయ్ జట్టులోకి వచ్చాడు.   

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్