DC vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. నలుగురు ఫారెన్ బ్యాటర్లతో లక్నో

DC vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. నలుగురు ఫారెన్ బ్యాటర్లతో లక్నో

ఐపీఎల్ లో మరో ఆసక్తికర మ్యాచ్ ప్రారంభమైంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లకు టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాహుల్ లేకుండానే ఢిల్లీ తమ తొలి మ్యాచ్ లో బరిలోకి దిగుతుంది. ఈ సీజన్ లో ఢిల్లీను అక్షర్ పటేల్.. లక్నోని రిషబ్ పంత్ తొలి సారిగా జట్టును నడిపిస్తున్నారు. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్,మిచెల్ స్టార్క్ ఢిల్లీ జట్టు ఫారెన్ ప్లేయర్లు. మరోవైపు లక్నో పూరన్, మిల్లర్, మార్క్రామ్,మిచెల్ మార్ష్ లతో బరిలోకి దిగుతుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్