
విశాఖపట్నం : చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ఐపీఎల్‌లో బోణీ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్నాడు. వైజాగ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది.
తొలిసారి ఈ తప్పిదం చేయడంతో నిబంధనల ప్రకారం ఆ టీమ్ కెప్టెన్ పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. కాగా, ఈ పోరులో ఢిల్లీ 20 రన్స్ తేడాతో సీఎస్కేను ఓడించింది.