ఢిల్లీ ఎలక్ట్రిక్ బస్సుల్లో మూడు రోజులు ఫ్రీ జర్నీ

ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో  ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ  ఇంద్రప్రస్థ బస్సు డిపో నుంచి 150 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల్లో మూడు రోజులపాటు ప్రజలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎలక్ట్రిక్ బస్సుల్లో అన్ని వసతులు కల్పించామన్నారు. ఇందులో సీసీ టీవీ కెమెరాలు,GPS,10 పానిక్ బటన్లు, వికలాంగుల కోసం ర్యాంప్‌లు మొదలైనవి ఉన్నాయి. వచ్చే నెలలో మరో 150 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం

 

ఒకే ఫ్రేమ్‌‌లో పవన్, అఖిరా, రేణుదేశాయ్, ఫాన్స్ ఫుల్ ఖుష్

‘పై ఫోనా’ మజాకా.. అంతరిక్షం నుంచీ కాల్స్