ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ ప్రజలకు శుభవార్త చెప్పారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. నగరంలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బస్సులను కేజ్రీవాల్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇది కాలుష్యాన్ని నియంత్రించడానికి ఒక ప్రభావవంతమైన చర్య అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఏప్రిల్ వరకు 300 ఈ‌‌–-బస్సులు ప్రారంభమవుతాయన్నారు. మొత్తం 2000 బస్సులను ప్రారంభించడం తమ లక్ష్యమన్నారు. ఈ బస్సు  కనిష్టంగా 120 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తుందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఎక్కడికక్కడ ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నామని  ఢిల్లీ సీఎం తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీ హర్యానా హెల్త్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. నిందిస్తే వైరస్ అంతం కాదన్నారు. అయినా ఈ చెత్తలో పడటం తనకు ఇష్టం లేదన్నారు. పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరన్నది రేపు మధ్యాహ్నం 12 గంటలవరకు తేలిపోతందన్నారు కేజ్రీవాల్. 

ఇవి కూడా చదవండి:

తమిళనాడులో ఘనంగా ఎంజీఆర్ జయంతి

ఢిల్లీలో వెయ్యికి పైగా కేసులు వారివే