ఈడీ నోటీసులు చట్టవిరుద్ధం..విచారణకు హాజరుకాలేను : కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  ఈడీ నోటీసులు వెనక్కి తీసుకోవాలని  సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి లేఖ రాశారు.  ఈడీ నోటీసులు చట్ట విరుద్ధమని.. రాజకీయ ప్రేరేపితమని  కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఆదేశాలతోనే ఈడీ నోటీసులిచ్చిందని ఆరోపించారు. తన ఎన్నికల ప్రచారాన్ని ఆపేందుకు ఈడీ నోటీసులిప్పించారని విమర్శించారు.  ఈడీ నోటీసులు వెనక్కితీసుకోవాలని అన్నారు.  మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి  ఉందన్నారు. ఎన్నికల ప్రచారం ముందే నిర్ణయించుకున్న కార్యక్రమం కాబట్టి విచారణకు హాజరుకాలేనన్నారు కేజ్రీవాల్. 

లిక్కర్​స్కామ్​కేసులో మనీలాండరింగ్​చట్టం కింద నవంబర్ 2న కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకావాల్సింది. ఈ క్రమంలో ఆయనకు నోటీసులివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ నేతలు పెద్ద ఎత్తును ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు.  తుగ్లక్ రోడ్డులోని ఈడీ ఆఫీసు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.  పారా మిలిటరీ పోలీసు బలగాలు చేరుకున్నాయి. 

Also Read : దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు : రాహుల్ గాంధీ

ఈడీకి లేఖ రాసిన కేజ్రీవాల్ విచారణకు వెళ్లకుండా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

కేజ్రీవాల్​ను నవంబర్​2న ఈడీ అరెస్ట్​ చేసే అవకాశం ఉందని ఈ పార్టీ ముఖ్యనేతలు సంచలన ఆరోపణలు చేశారు.  ఎన్నికల్లో ఓడించలేమని తెలిసే.. టాప్​లీడర్లను జైలుకు పంపండం ద్వారా ఆమ్​ఆద్మీ పార్టీని పూర్తిగా దెబ్బతిసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీ ముఖ్యనేతలు, మంత్రి అతిషి, సౌరభ్​భరద్వాజ్ అన్నారు. నవంబర్​2న కేజ్రీవాల్​ను అరెస్ట్​చేస్తే.. అవినీతి అభియోగాల కింద కాదని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకేనని తేలిపోతుందన్నారు.