కష్టమైనా తప్పడం లేదు.. 26 వరకు లాక్ డౌన్

కష్టమైనా తప్పడం లేదు..  26 వరకు లాక్ డౌన్

ఢిల్లీలో కరోనా విజృంభిస్తుండటంతో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.ఇవాళ రాత్రి 10 గంటల నుంచి(సోమవారం)నుంచి 26వ తేది ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందన్నారు.కష్టమైనా లాక్ డౌన్ విధించక తప్పడం లేదన్నారు.  లాక్ డౌన్ పొడగించాల్సిన అవసరం రాకూడదని ఆశిస్తున్నామన్నారు. వలస కార్మికులు రాష్ట్రంలోనే ఉండాలని సూచించారు. 

ఢిల్లీలో 4 వ వేవ్ మొదలైందన్నారు. అన్ని రాష్ట్రాలలో కంటే ఢిల్లీలోనే ఎక్కువ కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. రోజుకు లక్ష వరకు టెస్టులు చేస్తున్నామన్నారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 25 వేల పాజిటివ్ కేసులు వస్తున్నాయన్నారు. రోజుకు 25 వేల కంటే ఎక్కువ కేసులు వస్తే చికిత్స అందించడం కష్టం అవుతోందన్నారు. ఇప్పటివకే ఐసీయూ బెడ్స్ నిండిపోయాయని..ఆక్సిజన్ కొరత ఉందన్నారు.  ఈ విషయాలు బయపెట్టడానికి చెప్పడం లేదన్నారు.