న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో కూడా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని, కానీ గత రెండ్రోజుల్లో కేసులు తగ్గాయన్నారు. ఇది శుభపరిణామమని, రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరింత తగ్గుతాయని ఆశిస్తున్నానని చెప్పారు. హోం ఐసోలేషన్ లో ఉన్న కొవిడ్ పేషెంట్ల కోసం ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటున్న వారి కోసం ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చన్నారు.
होम आइसोलेशन में रहकर इलाज ले रहे सभी कोरोना संक्रमित मरीज़ जल्द से जल्द स्वस्थ हो सकें, इसके लिए दिल्ली सरकार ‘दिल्ली की योगशाला’ के तहत एक नई पहल शुरू कर रही है। Press Conference | LIVE https://t.co/0clJJX9a9z
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 11, 2022
‘యోగా, ప్రాణాయామంతో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. నిరంతరం యోగా, ప్రాణాయామం చేయడం వల్ల కరోనా లాంటి వ్యాధులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అందుకే ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటున్న వారి కోసం ప్రత్యేకంగా యోగా క్లాసులను నిర్వహించాలని నిర్ణయించాం. ఆన్ లైన్ ద్వారా వాళ్లు తమ ఇళ్లలో నుంచే ఇన్ స్ట్రక్టర్ల సూచనలు పాటిస్తూ యోగా, ప్రాణాయామం చేయొచ్చు. ఇప్పటికే ఇన్ స్ట్రక్టర్ల టీమ్ ను రూపొందించాం. కరోనాకు సంబంధించి చేయాల్సిన ఆసనాలపై ఇన్ స్ట్రక్టర్ల టీమ్ కు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చాం. హోం ఐసోలేషన్ లో ఉన్న ప్రతి పేషెంట్ కు లింక్ లు పంపుతాం. ఆ లింక్ పై క్లిక్ చేసి, వారు ఏ టైమ్ కు యోగా చేయాలనుకుంటున్నారో చెప్పాలి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు క్లాసులు ఉంటాయి. మొత్తంగా 8 గంటలు, 8 క్లాసులు ఉంటాయి. దీంట్లో ఏ ఒక్క గంటసేపు అయినా క్లాసును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకేసారి 40 వేల మంది క్లాసులు వినేలా ఏర్పాట్లు చేశాం. ఒక్కో ఇన్ స్ట్రక్టర్ 15 మందితో ప్రత్యేకంగా చర్చిస్తూ క్లాసులు చెబుతారు. పర్సనల్ అటెన్షన్ ఉండాలని ఈవిధంగా ప్లాన్ చేశాం. రేపట్నుంచి ఈ క్లాసులు మొదలవుతాయి. ఈ క్లాసుల వల్ల పేషెంట్లకు ఇమ్యూనిటీతోపాటు మానసిక స్థైర్యం పెరుతుందని ఆశిస్తున్నాం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం: