Delhi Air Polution:దారుణంగా పడిపోయిన ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ..ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం

Delhi Air Polution:దారుణంగా పడిపోయిన ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ..ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం
  • పొల్యూషన్ కంట్రోల్ కు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు 
  • గవర్నమెంట్ ఆఫీసుల టైమింగ్స్ మార్చిన సీఎం అతిషీ 
  • అంతరాష్ట్ర వాహనాలపై నిషేధం

దేశరాజధాని ఢిల్లీలో గత మూడు రోజలుగా ఎయిర్ పొల్యూషన్ దారుణంగా పెరిగింది.  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం (నవంబర్ 15) ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 411 AQI నమోదు అయింది. 

ఢిల్లీలో గత మూడు రోజులుగా వరసగా ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నందున సీఎం అతిషీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు ప్రభుత్వం ఆఫీసుల టైమింగ్స్ లో మార్పుచేస్తూ ప్రకటన విడుదల చేశారు.   

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది.  అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 5.30 వరకు డ్యూటీ చేయాలి. 

ఇక ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసే సిబ్బంది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆఫీసు కార్యకలాపాలు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిషీ తెలిపారు. ఢిల్లీలో పేలవలైన గాలినాణ్యతకు కారణమైన వాహనాల నుంచి ఉద్గారాలను తగ్గించేందుకు లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అతిషీ ప్రకటించారు. 

మరోవైపు ఢిల్లీలో గాలి నాణ్యత పెంచేందుకు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనవసరమైన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించారు. ఢిల్లీ ఎన్ సీఆర్ పరధిలోని స్టోన్ క్రషర్లు, మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు. 

ALSO READ | ఇలా ఎలా నమ్ముతారో.. గాడిద పాల పేరిట వంద కోట్ల మోసం.. నిండా ముంచేశారు..!

ఢిల్లీ చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి అంతర్ రాష్ట్ర బస్సులపై నిషేధం విధించారు. ఎలక్ట్రిక్ , సీఎంజీ, బీఎస్ విఐ డీజిల్ బస్సుకు మాత్రమే అనుమతిస్తున్నారు. AQI మరింత దిగజారితే మరిన్ని కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 

ఢిల్లీలో గాలి నాణ్యత దారుణ పడిపోయింది.  ఎయిర్ క్వాలిటి మేనేజ్ మెంట్ కమిషన్ (CAQM) GRAP  స్టేజ్ III లిమిట్స్ విధించింది. ఢిల్లీలో శుక్రవారం (నవంబర్ 15) ఉదయం  9గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 411 వద్ద నమోదుఅయింది. ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ 400 నుంచి 500 మధ్య లో ఉంటే గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంటుంది.  

శుక్రవారం ఉదయం రాజధాని నగరం మొత్తం దట్టమైన పొగమంచుతో కమ్ముకుంది. సఫ్దర్ జంగ్ తో సహా ఢిల్లీలో పలు ప్రాంతాల్లో దృశ్యమానం పూర్తిగా తగ్గిపోవడం గాలి నాణ్యత ఎంత అధ్వాన్నంగా ఉందో తెలియజేస్తుంది. దీంతో ఉష్ణ్రోగ్రతలు కూడా గణనీయంగా పడిపోయాయి. ఈ సీజన్ లో అత్యల్ప ఉష్ణో్గ్రత 15.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయింది. 

ఢిల్లీ సీఎం అతిషీ ప్రకటనలో దేశరాజధానిలో కాలుష్యం తగ్గి గాలి నాణ్యత పెరుగుతందిన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఈ సమయాలను పాటించాలని కోరారు.