ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెనషన్ వాతావరణం నెలకొంది. ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు ఆయన ఫోన్.. ఆయన భార్య ఫోన్లను సీజ్ చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ హైకోర్డు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రిజిష్ట్రీకు అప్ నేతలు మెయిల్ చేశారు. కేజ్రీవాల్ ఇంటికి వెళ్లే అన్నీ దారులను మూసివేశారు.
కేజ్రీవాల్ ను కలిసేందుకు అప్ మంత్రులు ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే కేజ్రీవాల్ నివాసంలోకి ఎవరిని ఈడీ అధికారులు ఎంటరవనివ్వడం లేదు. కేజ్రీవాల్ నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే 12 మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా.. మరో బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకుందని సమాచారం అందుతోంది. తన ఇంట్లోనే విచారించాలని ఈడీ అధికారులను ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతుండటంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.