ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు( August 5) కొట్టివేసింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే కొనసాగుతుందని ప్రకటించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. దీంతో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో ఆయన మరికొన్ని రోజుల పాటు తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
సరైన కారణాలు లేకుండా సీబీఐ అరెస్ట్ చేసిందని చెప్పడానికి ఆధారాలు లేవని పేర్కొంది. బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును కూడా హైకోర్టు కొట్టివేసింది. అయితే బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై తొలుత ఈడీ కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయనకు ఊరట లభించినప్పటికీ సీబీఐ అరెస్ట్ విషయంలో జైల్లోనే ఉండిపోయారు. ఈడీ కేసులో జులై 12న ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది.