డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డిజిటల్ ప్రచారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. ఏక్ మౌక కేజ్రీవాల్ కో  అనే నినాదంతో ( కేజ్రీవాల్ కి ఒక్కసారి అవకాశం ఇవ్వండి)ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం చేసిన మంచి పనులు, పథకాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయ్యాలని దేశ రాజధాని ప్రజలను కోరారు. 50 మంది డిల్లీ వాసుల వీడియో రూపంలో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ఎక్కువగా వైరల్ చేస్తారో వారితో కలిసి ఎన్నికల ఫలితాల తర్వాత డిన్నర్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న పనులు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్, ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లో ప్రచారం  చేయ్యాలని పిలుపునిచ్చారు. తాము ప్రవేశ పెట్టిన పథకాల వల్ల ఢిల్లీ ప్రజలు ఏ విధంగా  లబ్ధి పొందారో వీడియోల ద్వారా వైరల్ చేయ్యాలని సూచించారు. డిజిటల్ ప్రచారం సందర్భంగా ఢిల్లీలో తమ  ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటు, ఉచిత నీరు వంటి పథకాల గురించి ప్రధానంగా ఫోకస్ చేయాలన్నారు. మోహల్లా క్లినిక్స్, స్కూల్స్  అభివృద్ధి, 24 గంటల విద్యుత్ వీటన్నింటిని జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వీడియోల ద్వారా ప్రచారం చేయాలన్నారు. 


మరిన్ని వార్తల కోసం

భూతల స్వర్గాన్ని తలపిస్తోన్న జమ్మూకశ్మీర్

ఆడుకుంటున్న పిల్లలపై మంత్రి కుమారుడి దారుణం