నియంతృత్వాన్ని వ్యతిరేకించినందుకే జైలుకు పంపారు:కేజ్రీవాల్

నియంతృత్వాన్ని వ్యతిరేకించినందుకే జైలుకు పంపారు:కేజ్రీవాల్

న్యూఢిల్లీ: నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకే తనను జైల్లో పెట్టారని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం (జూన్ 2) తీహార్ జైలుకు వెళ్లేందుకు ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మూడు వారాల బెయిన్ జూన్ 1 ముగియడంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు తీహార్ జైలు వెళ్లేముందుకు మీడియాతో మాట్లాడారు. 

తనను దోషిగా నిరూపించేందుకు తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ప్రధాని మోదీ దేశం ముందు అంగీకరరించారని కేజ్రీవాల్ అన్నారు. జైలుకు వెళ్లే ముందు రాజ్ ఘాట్ లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కన్నాట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అర్వింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ జూన్ 1 న ముగిసింది. వైద కారణాలతో మరోసారి మధ్యంతర బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ ఢిల్ల కోర్టు ను ఆశ్రయించారు. జూన్ 5న బెయిల్ పిటిషన్ పై విచారణకు రానుంది.