అక్రమ వినియోగం ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి అధికారిక నివాసాన్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) విభాగం బుధవారం(అక్టోబర్ 09) సీల్ చేసింది. గత వారం రోజుల వరకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడంతో దానిని ఖాళీ చేశారు.
కేజ్రీవాల్ అనంతరం ఢిల్లీ సీఎంబాధ్యతలు చేప్పట్టిన అతిషి అదే నివాసానికి మారగా.. పీడబ్ల్యూడీ అధికారులు ఆమె వస్తువులను అక్కడినుండి మరొకచోటకి తరలించారు.
ALSO READ | జమిలి ఎన్నికలు పెడితే నష్టమేంటి ? : సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి నివాసం నుండి అతిషికి చెందిన అన్ని వస్తువులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తొలగించారని ఢిల్లీ సిఎంఓ పేర్కొంది. ఆ ఇంటిని ఓ బీజేపీ నాయకుడికి కేటాయించాలని గవర్నర్ ఒత్తిడి తెస్తున్నందునబీజేపీ ఆదేశాల మేరకు బలవంతంగా ఖాళీ చేయబడ్డారని సిఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. గత 27 ఏళ్లుగా ముఖ్యమంత్రులకు నివాసయోగ్యంగా ఉన్న ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎంఓ పేర్కొంది.
A team of PWD officials reached Delhi Chief Minister's residence, 6-flag Staff Road, Civil Lines
— ANI (@ANI) October 9, 2024
Delhi CMO claims that Delhi LG got all the belongings of Chief Minister Atishi removed from the Chief Minister's residence.