బట్లర్ బాదుడుకు ఢిల్లీ విలవిల.. భారీ స్కోర్ను ఊదేసిన గుజరాత్

బట్లర్ బాదుడుకు ఢిల్లీ విలవిల.. భారీ స్కోర్ను ఊదేసిన గుజరాత్
  • భళా బట్లర్‌..‌ దంచికొట్టిన జోస్‌, రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 7 వికెట్లతో ఢిల్లీపై గుజరాత్ విక్టరీ
  • రాణించిన ప్రసిధ్ కృష్ణ

అహ్మదాబాద్‌: జోస్ బట్లర్ (54 బాల్స్‌‌‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 నాటౌట్‌) విధ్వంసకర బ్యాటింగ్‌‌‌తో విజృంభించిన వేళ టేబుల్ టాపర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు  గుజరాత్ టైటాన్స్‌చెక్ పెట్టింది. షెర్ఫానె రూథర్‌‌‌‌ఫోర్డ్ (34 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 43) కూడా రాణించడంతో మెగా లీగ్‌‌లో తమ అత్యధిక టార్గెట్‌ఛేజ్‌చేసిన జీటీ ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌‌కు దూసుకొచ్చింది. శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌‌‌లో జీటీ 7 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. 

తొలుత  డీసీ నిర్ణీత 20 ఓవర్లలో 203/8 స్కోరు చేసింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (32 బాల్స్‌లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 39), అశుతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ (19 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37) రాణించారు.   ప్రసిధ్ కృష్ణ (4/41) నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బట్లర్‌ధనాధన్ బ్యాటింగ్‌‌‌తో జీటీ 19.2 ఓవర్లలో 204/3 స్కోరు చేసి గెలిచింది. అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

తలో చేయి..

టాప్ మిడిలార్డర్ బ్యాటర్లు తలోచేయి వేయడంతో  ఢిల్లీ 200 ప్లస్ స్కోరు చేసింది. నాలుగు వికెట్లు పడగొట్టిన జీటీ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ, పొదుపుగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన వెటరన్ ఇషాంత్ శర్మ (1/19) ఆ టీమ్ మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.  టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన  డీసీకి ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (18),   కరుణ్ నాయర్ (18 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31) మెరుపు ఆరంభం ఇచ్చారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు,  సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోరెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16 రన్స్ రాబట్టాడు. కానీ రెండో ఓవర్లో అర్షద్ ఖాన్ వేసిన ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  మిడాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన కేఎల్ రాహుల్ (14 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 28)  సిరాజ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4,6 కొట్టగా.. కరుణ్ నాయర్ సిక్స్ బాదాడు. అర్షద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ రెండు ఫోర్లతో అలరించిన రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐదో ఓవర్లో ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్బీ చేయడంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 35 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జోరు పెంచిన కరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అర్షద్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4, 6 బాది ప్రసిధ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఔటయ్యాడు. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్ (31),  కెప్టెన్ అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లారు. స్టబ్స్ భారీ షాట్లతో అలరించగా... అక్షర్  తనకు సపోర్ట్ ఇచ్చాడు. 

స్పిన్నర్ రషీద్ వేసిన 14వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన స్టబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో  ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 53 రన్స్ భాగస్వామ్యం ముసింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రీజులోకి వచ్చిన అశుతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. 17వ ఓవర్లో ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విప్రజ్ నిగమ్ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా.. అశుతోష్ వరుసగా రెండు సిక్సర్లతో 15 రన్స్ రాబట్టాడు. ఇన్నింగ్స్ చివరి బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కుల్దీప్ (4 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫోర్ కొట్టడంతో డీసీ స్కోరు 200 దాటింది. 

జోస్ జోరు

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌ ఆరంభంలోనే కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్ (7) వికెట్ కోల్పోయినా.. బట్లర్ అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడు. కరుణ్ నాయర్ కొట్టిన డైరెక్ట్ త్రోకు  రెండో  ఓవర్లోనే గిల్ రనౌటై నిరాశపరచినా..  మరో ఓపెనర్  సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (36) తోడుగా బట్లర్ తన ఫామ్ కొనసాగించాడు. స్టార్క్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లు, అక్షర్ పటేల్ ఓవర్లో సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అలరించాడు. విప్రజ్ నిగమ్  వేసిన ఐదో ఓవర్లో బట్లర్ వరుసగా రెండు సిక్సర్లతో జోరందుకోవడంతో పవర్ ప్లేను జీటీ 67/1తో ముగించింది. 

ఫీల్డింగ్ మారిన తర్వాత బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన స్పిన్నర్ కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన మూడో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఔట్ చేయడంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 60 రన్స్  పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న బట్లర్ తన జోరు కొనసాగించాడు. రూథర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్డ్‌‌‌‌తో  కలిసి క్రమం తప్పకుండా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కరిగించాడు. తన మార్కు క్లాసిక్ షాట్లతో బట్లర్ అభిమానులను ఆకట్టుకున్నాడు. మిచెల్ స్టార్క్ వేసిన 15వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా ఐదు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 

అంతకుముందు రూథర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్డ్ భారీ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మోహిత్ శర్మ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి జట్టును ముందుకు నడిపించాడు.  ముకేశ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అతను ఔటవ్వడంతో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 119 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. అప్పటికే జీటీ విజయం ఖాయం అవ్వగా.. బట్లర్ సెంచరీ ముంగిట నిలిచాడు. చివరి ఓవర్లో పది రన్స్ అవసరం అవ్వగా.. రాహుల్ తెవాటియా (11 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 6, 4తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగించడంతో బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌సెంచరీ అందుకోలేకపోయాడు. 

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ: 20 ఓవర్లలో 203/8 (అక్షర్ పటేల్ 39, అశుతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ 37,   ప్రసిధ్ కృష్ణ 4/41)
గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 19.2  ఓవర్లలో  204/3  (బట్లర్ 97 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 
రూథర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్డ్ 43, కుల్దీప్ 1/30)