ఒడిశా, ఢిల్లీ జట్ల గెలుపు

ఒడిశా, ఢిల్లీ  జట్ల గెలుపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ ఫుట్‌‌‌‌బాల్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ఫైనల్ రౌండ్‌‌‌‌లో మాజీ చాంపియన్‌‌‌‌ గోవాకు ఒడిశా షాకిచ్చింది. మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌లో ఒడిశా 2–0తో గోవాను ఓడించింది. రాహుల్ ముఖి (60వ నిమిషం), కార్తీక్‌‌‌‌ హంటల్ (64వ ని) నాలుగు నిమిషాల వ్యవధిలో చెరో గోల్‌‌‌‌ చేసి ఒడిశాను గెలిపించారు. మరో మ్యాచ్‌‌‌‌లో ఢిల్లీ 2–0తో తమిళనాడుపై విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో భారన్యు బన్సల్ (7వ నిమిషం), ఆశీష్  షా (65వ ని) చెరో గోల్ కొట్టారు. ఇంకో మ్యాచ్‌‌‌‌లో  కేరళ 1–0తో మేఘాలయను ఓడించింది.