ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో.. కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో.. కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు 

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసు మనీలాండరింగ్  కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం (జూన్23, 2024) పొడిగించింది. కేజ్రీవాల్, వినోద్ చౌహాన్ల కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు పొడిగించింది. మనీలాండరింగ్ కేసులో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. 

2022లో గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్ పార్టీ ఎన్నికల ప్రచారానికి నిధులు సమకూర్చేందుకు హవాలా మార్గాల ద్వారా కోట్ల రూపాయలు బదిలీ చేసిన వ్యక్తి వినోద్ చౌహాన్ . ఈ డబ్బు ఢిల్లీ లిక్కర్  కుంభకోణంలోంచి  వచ్చిందని చౌహాన్ కు తెలుసని ఈడీ కోర్టు ముందుకు వాదించింది. ఈ కేసులో చౌహాన్ తోపాటు కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ ఎంపీ కె కవిత తో సహా పలువురిని ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. 

ఇదిలా ఉంటే.. మెడికల్ బోర్డు సంప్రదింపుల కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన భార్య హాజరు కావాలని కేజ్రీవాల్ వేసిన మరో పిటిషన్ పై కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.