ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్కు ఢిల్లీ కోర్టు బెయిల్

ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్కు ఢిల్లీ కోర్టు బెయిల్

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ నేత, మాజీరైల్వే మంత్రి లాలూ ప్రసాద్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాలూతోపాటు ఆయన కుమారుడు తేజ స్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లకు బెయిల్ మంజూరైంది. 

సోమవారం (అక్టోబర్ 07) నాడు ఉద్యోగాల కుంభకోణంలో కేసును విచారించిన ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ..లాలూ ప్రసాద్, తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై లాలూకు బెయిల్ మంజూరు చేశారు. 

Also Read :- మతిపోగొడుతున్న మహేష్ లేటెస్ట్ స్టిల్స్

2004నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ రైల్వే మంత్రి గా ఉన్న సమయంలో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఉన్న రైల్వే వెస్ట్ సెంట్రల్ జోన్ లో జరిగిన గ్రూప్ డి నియామకాలకు సంబంధించిన కేసులో అక్రమాలు చేసిన వారినుంచి భూములను బహుమతిగా తీసుకున్నట్లు లాలూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.