అర్నబ్ గోసామికి ఢిల్లీ కోర్టు సమన్లు

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోసామికి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. పరువు నష్టం కేసులో ఆయనతో పాటు ఎడిటర్ అనన్యా వర్మలకు సమన్లు జారీ చేసింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్ధపై తప్పడు ప్రచారం చేశారంటూ అభియోగాలు నమోదయ్యాయి. దీనికి సంబంధించి  సాకేత్ కోర్టు ఆడిషనల్ సివిల్ జడ్జీ షీతల్ చౌదరీ ప్రధాన్ సమన్లు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 2వ తేదీకి వాయిదా వేశారు.