
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఫిబ్రవరి 17న కోర్టు ముందుహాజరు కావాలని ఆదేశించింది. విచారణకు హాజరు కావాలని తాము 5 సార్లు నోటీసుులు జారీ చేసిన కేజ్రీవాల్ పట్టించుకోలేదంటూ రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిబ్రవరి 3న ఫిర్యాదు చేసింది. దీంతో కోర్టు ఆయనకు సమన్లు పంపింది.
ALSO READ :- Lal Salaam: రజినీకాంత్ లాల్ సలామ్ సెన్సార్ కంప్లీట్..రన్ టైమ్ ఎంతంటే?
ఈ కేసులో గత నాలుగు నెలల్లో కేజ్రీవాల్‌కు ఈడీ ఐదు సమన్లు జారీ చేసింది. అయితే అవి అక్రమమని పేర్కొంటూ సీఎం కేజ్రీవాల్ సమన్లను దాటవేశారు. మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా ఇదే కేసులో గతేడాది ఆగస్టులో సీబీఐ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. తొమ్మిది గంటలపాటు సీబీఐ ఆయన్ను విచారించింది.