ఢిల్లీలో తగ్గుతున్న కరోనా

ఢిల్లీలో తగ్గుతున్న కరోనా

ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కేజ్రీవాల్ సర్కార్ సక్సెస్ అయ్యింది. దేశ రాజధానిలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ఇవాళ ఐదు వేల కంటే తక్కువ కేసులు నమోదవుతాయన్నారు. పాజిటివిటీ రేటు కూడా 10 శాతం నుంచి మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. నిన్న నగరంలో 7,498 కేసులు నమోదయ్యాయి. కాసేపట్లో కరోనా పరిస్థితిపై చర్చించడానికి గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సమావేశం కానుంది. ప్రస్తుతం అమలవుతోన్న కోవిడ్ ఆంక్షలపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో పాఠశాలలు పునఃప్రారంభించాలని ఢిల్లీ ప్రభుత్వం సిఫార్సు చేస్తుందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కోవిడ్ కారణంగా స్కూళ్లు మూతబడటంతో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు మరో షాక్

రాహుల్ గాంధీ లేఖపై స్పందించిన ట్విట్టర్