వయసు మీద పడిందని కలలు కనడం మానొద్దు

వయసు మీద పడిందని కలలు కనడం మానొద్దు

67 ఏండ్ల వయసున్న వాళ్లు ఏంచేస్తారు. రిటైర్‌‌‌‌ అయిపోయి వాళ్ల బరువు బాధ్యతలన్నింటినీ తీర్చేసుకొని మనవళ్లు, మనవరాళ్లతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతారు. కానీ, ఈవిడ అలా కాదు డాక్టర్​గా ప్రాక్టీస్​ చేస్తూ మరోవైపు ప్రొఫెషనల్‌‌  మోడల్ అయింది. పేరు ‘డాక్టర్‌‌‌‌ గీత’.

‘ఏజ్‌‌‌‌ అనేది ఒక నెంబర్‌‌‌‌‌‌‌‌ మాత్రమే. మీరు ఏంచేయాలనుకున్నా దానికి వయసు అడ్డు పడదు’ అంటుంది ఢిల్లీకి చెందిన గీతా ప్రకాశ్. ఢిల్లీలోని మ్యాక్స్‌‌‌‌ మల్టీ స్పెషాలిటీ సెంటర్ హాస్పిటల్‌‌‌‌లో జనరల్‌‌‌‌ ఫిజీషియన్‌‌‌‌గా చేస్తున్న గీత, అనుకోకుండా మోడల్‌‌‌‌ అయింది. అంతేకాదు ప్రొఫెషనల్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌లకు మోడలింగ్‌‌‌‌ చేస్తూ యువ మోడల్స్‌‌‌‌కు పోటీ ఇస్తోంది. గీతతో మోడలింగ్‌‌‌‌ చేయించి వాళ్ల బ్రాండ్‌‌‌‌ను ప్రమోట్‌‌‌‌ చేసుకోవడానికి డిజైనర్స్‌‌‌‌, ఫొటోగ్రాఫర్స్‌‌‌‌ ‘క్యూ’ కడుతున్నారు. అంజూ మోడి, తరుణ్‌‌‌‌ తహిలియాని, గౌరవ్‌‌‌‌ గుప్త, తోరణి, నికోబార్‌‌‌‌‌‌‌‌, జైపూర్‌‌‌‌‌‌‌‌, అష్దీన్‌‌‌‌ లాంటి పెద్ద పెద్ద డిజైనర్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్స్‌‌‌‌కు గీత మోడలింగ్‌‌‌‌ చేసింది. అసలు ఆమెకు మోడలింగ్‌‌‌‌ మీద దృష్టే లేదు. మోడల్‌‌‌‌ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఒక ఇటాలియన్‌‌‌‌ ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌ ఆరోగ్యం బాగోలేదని ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం గీత హాస్పిటల్‌‌‌‌కు వెళ్లాడు. గీతను చూసి తన బ్రాండ్‌‌‌‌కు మోడలింగ్‌‌‌‌ చేయమని అడిగాడట. కొన్ని నెలల తరువాత ఫొటోలు పంపమని మెయిల్‌‌‌‌ పంపాడు. తన పిల్లలు సెలక్ట్‌‌‌‌ చేసిన కొన్ని ఫొటోలను అతనికి పంపింది గీత. ఆ ఫొటోలు నచ్చి మోడల్‌‌‌‌గా చేయమని అడిగాయి కొన్ని బ్రాండ్స్‌‌‌‌. మొదట తరుణి తహిలియాని బ్రాండ్‌‌‌‌ ప్రచారానికి మోడలింగ్‌‌‌‌ చేసింది. తరువాత జైపూర్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌తో కలిసి తన వయసు వాళ్లు వేసుకొనే ‘శాలువా’కు మోడలింగ్‌‌‌‌ చేసింది. అదే మొదటి బ్రేక్‌‌‌‌. అవి చూసి వేరే బ్రాండ్స్‌‌‌‌ కూడా గీతను కలిసి వాళ్లకు కూడా మోడలింగ్‌‌‌‌ చేయమని అడిగాయి. అప్పటినుండి మోడలింగ్‌‌‌‌ ఆమె ప్యాషన్‌‌‌‌ అయింది. మోడలింగ్‌‌‌‌లో పడి డాక్టర్ వృత్తినేం మరిచిపోలేదు. డాక్టర్‌‌‌‌‌‌‌‌గా సేవ చేస్తూనే ఖాళీ టైంలో, అదికూడా ఎక్కువ శాతం వీకెండ్‌‌‌‌లోనే మోడలింగ్‌‌‌‌కు అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇస్తుంటుంది. డాక్టర్‌‌‌‌‌‌‌‌ వృత్తి మీద ప్రేమతో తన ఇంటి దగ్గరే ఒక చారిటబుల్‌‌‌‌ క్లినిక్ పెట్టి ఫ్రీగా వైద్యం చేస్తోంది. తను చేస్తున్న పనులకు ఇంట్లో వాళ్ల సపోర్ట్‌‌‌‌ కూడా బాగా ఉంది. మ్యాగజైన్స్‌‌‌‌, ఫ్లెక్సీబోర్డులు, అడ్వర్టైజ్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో ఫొటోలు చూసిన ఆమె పిల్లలు ఫోన్‌‌‌‌లో ఫొటోలు తీసి గీతకు పంపుతుంటారట. తల్లికి అంత పేరొ చ్చినందుకు వాళ్లు గర్వంగా ఫీల్‌‌‌‌ అవుతున్నారట.

‘వయసు మీద పడిందని కలలు కనడం మానొద్దు. ఏ వయసులో అయినాసరే ఆడవాళ్లు చేయా లనుకున్న పనిని చేసేయండి. అందులో ఆనందం తప్పక దొరుకుతుంది. ఎంత వయసొచ్చినా కలలు కనడం ఆపకూడదు. ప్రపంచంలో దేనికీ వయో పరిమితి లేదు. మీ అభిరుచికి వయసు అడ్డుకాకూడదు. ఎవరైనా ఏమనుకుంటారు అనే ఆలోచనను మీ మనసులో నుంచి తీసేయండి. ఈ రోజు అలా అన్న వాళ్లే రేపు మిమ్మల్ని చూసి ఈర్ష్య పడతారు. ఆ స్థాయికి ఎదగాలి. నేను ఈ ఏజ్‌‌లో చేయగలుగుతున్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు’ అంటోంది గీతా ప్రకాశ్.