Delhi earthquake: అలారం బదులు భూకంపంతో నిద్ర లేచిన ఢిల్లీ జనం..

Delhi earthquake: అలారం బదులు భూకంపంతో నిద్ర లేచిన ఢిల్లీ జనం..

ఢిల్లీని భూకంపం వణికించింది. సోమవారం (ఫిబ్రవరి 17) తెల్లవారుజామున భూమి కంపించడంతో జనాలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వచ్చిన భూకంపానికి నిద్ర లేచిన జనం భయంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడం రాజధాని ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. 

ఢిల్లీలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపంతో ఇళ్లల్లోని వస్తువులు కదలటం, కిందకు పడిపోవడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

ఢిల్లీ భూకంపంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు. భూకంపం వచ్చిన సందర్భంలో జాగ్రత్త చర్యలు తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు.