Delhi elctions result: ఎంఐఎం పోటీతో లాభపడ్డ బీజేపీ..ఎలా అంటే.?

Delhi elctions result:   ఎంఐఎం పోటీతో  లాభపడ్డ బీజేపీ..ఎలా అంటే.?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది . ప్రస్తుతం బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యంలో  కొనసాగుతోంది.  ప్రభుత్వ ఏర్పాటు కంటే అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో  ఉండటంతో  27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై  కాషాయ జెండా ఎగరబోతుంది.

 అయితే ఈ ఎన్నికల్లో  ఎంఐఎం పోటీతో ఒక నియోజకవర్గంలో   బీజేపీ పడింది.  ఢిల్లీలోని  ముస్తాఫాబాద్‌లో  బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్త్  17 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  ఈ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి తాహిర్ హుస్సేన్  30 వేలకు పైగా ఓట్లు సాధించారు.  కాంగ్రెస్ అభ్యర్థి అలీ మెహ్దీ10 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఎంఐఎం, కాంగ్రెస్ పోటీ కారణంగా ఆప్ అభ్యర్థి అదీల్ అహ్మద్ ఖాన్  వెనుకంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్,ఆప్ విడిగా పోటి చేయడం  వల్ల  ఓట్లు చీలి బీజేపీకి పడ్డాయని తెలుస్తోంది. 

 సీఎం ఎవరు.?

ఢిల్లీలో బీజేపీ విజయం ఘన విజయం సాధించడంతో.. నెక్ట్స్ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్‎ను మట్టికరిపించిన పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. సీఎం అభ్యర్థిగా పర్వేష్ పేరు దాదాపు ఖాయమైనట్లేనని బీజేపీ వర్గా్ల్లో ప్రచారం జరుగుతోంది. న్యూఢిల్లీ సెగ్మెంట్లో విజయం సాధించిన వెంటనే పర్వేష్ వర్మ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. మరీ ఢిల్లీ సీఎం పగ్గాలను బీజేపీ ఎవరికీ అప్పగిస్తుందో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.