Delhi Election 2025: చీపురు చిత్తయింది.. కమలం విరిసింది..

Delhi Election 2025: చీపురు చిత్తయింది.. కమలం విరిసింది..

రెండు దశాబ్దాల వనవసానికి ఎండ్ కార్డ్ వేస్తూ ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందని ప్రస్తుత ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల లెక్కింపు కొనసాగుతుంది.  2025 ఎన్నికల్లో ఢిల్లీలో చీపురు చిత్తయింది.. కమలం విరిసింది. దేశరాజధాని ఢిల్లీలో అధికారం మారే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలను విశ్లేషిస్తే అధికారంలో ఉన్న చీపురు పార్టీ అధికారాన్ని కోల్పోయే విధంగా ఉంది.  27 సంవత్సరాలు నిరీక్షించిన కమలం పార్టీ నేతలు ఢిల్లీని శాసించడానికి సిద్దమవుతున్నారు.  ఇక కాంగ్రెస్​ ఇప్పటి వరకు కేవల్ ఒక్క స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. 

ఢిల్లీలో మోదీ మంత్రాంగం ఫలించింది. బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రౌండు రౌండుకి ఫలితాలు మారుతున్నాయి.  ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న ఆప్​ నేతలు కేజ్రీవాల్​, ఢిల్లీ సీఎం అతిశి. సిసోడియా మూడో రౌండ్​ ముగిసేసరికి ముందంజలోకి వచ్చారు.  ఇప్పటికే బీజేపీ మ్యాజిక్​ ఫిగర్​ దాటింది. ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే  ( ఉదయం 11 గంటల వరకు) బీజేపీ 47.66 శాతం.. ఆప్​ 43 శాతం.. కాంగ్రెస్​ 6.8 శాతం ఓట్లషేర్​ ను సాధించాయి.   ఢిల్లీ అభివృద్ధి విషయంలో ఆప్ పట్టించుకోవడం లేదని ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ఆరోపించారు.  యుమునా నది కాలుష్యం సహా అనేక హామీలను నెరవేర్చలేదంటూ..  లిక్కర్ స్కాం సహా పలు విషయాల్లో అనేక మంది ఆప్ నేతలు జైలుకెళ్లారని బీజేపీ ప్రచారం చేసింది.