![ఆప్ పార్టీ పతనంలో స్వాతి మలివాల్.. ఇంతకీ ఎవరు ఈమె.. శపథం ఏంటీ..?](https://static.v6velugu.com/uploads/2025/02/delhi-election-results-2025draupadis-vengeance---how-swati-maliwal-got-her-proverbial-revenge-against-aap-and-arvind-kejriwal_Eugl9FNBCy.jpg)
ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత కాషాయ జెండా ఎగరబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 40కి పైగా సీట్లలో ఆధిక్యంతో ఉంది. ఇక ఆప్ 20 కి పైగా సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు. న్యూ ఢిల్లీ నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్.. బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహెచ్ సింగ్ చేతిలో ఓడిపోయారు. 3 వేల ఓట్ల తేడా ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ ను ఓడించటం చాలా మంది ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఢిల్లీలో ఆప్ ఓటమి తర్వాత స్వాతి మలివాల్ మరోసారి తెరపైకి వచ్చింది. కేజ్రీవాల్ పతనానికి ఆమె కూడా ఒక విధంగా కారణం కావొచ్చనే చర్చ జరుగుతోంది. స్వాతి మలివాల్ చేసిన ప్రతిజ్ఞ ఇపుడు నిజమైందని చర్చ నడుస్తోంది. అసలు స్వాతి మలివాల్ ఎవరు.. ఇంతకీ ఆమె చేసిన ప్రతిజ్ఞ ఏంటో చూద్దాం.
స్వాతి మలివాల్ ఎవరంటే.?
స్వాతి మలివాల్ 1984 అక్టోబర్ 15న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జన్మించారు . స్వాతి మలివాల్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ. సామాజిక కార్యకర్త అన్నా హజారే నేతృత్వంలోని 2011 భారత అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆమె పాల్గొన్నారు. తరువాత ఆప్ లో పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసింది. 2015 నుంచి 2024 వరకు ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) చైర్‌పర్సన్‌గా పనిచేశారు .
ALSO READ | ఢీల్లీలో ఆప్, కాంగ్రెస్ పార్టీలే బీజేపీని గెలిపించాయా..?
2024 మే 13న ముఖ్యమంత్రి నివాసంలో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని మలివాల్ ఆరోపించింది . ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. మలివాల్ ఫిర్యాదుతో 2024 మే 16న ఢిల్లీ పోలీసులుFIR నమోదు చేశారు . గత 18 ఏండ్లుగా నేను కిందిస్థాయిలో పనిచేశానని...9 ఏండ్లలో మహిళా కమిషన్ లో 1.7 లక్షల కేసులు విన్నాను. ఎవరికీ భయపడకుండా, ఎవరి ముందు తలవంచకుండా మహిళా కమిషన్‌ను టాప్ పొజిషన్‌కు చేర్చాను. అయితే, సీఎం ఇంట్లో నన్ను దారుణంగా కొట్టి నా క్యారెక్టర్‌ను దిగజార్చారని ఆరోపించారు. అయితే తనపై జరిగిన దాడిపై
ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మద్దతివ్వకపోతగా... కనీసం దాడిని కూడా ఖండించలేదు. తాను సేవ చేసిన పార్టీ తనను గుర్తించలేని ఆవేదన వ్యక్తం చేసింది.
దుశ్శాసనుడి రక్తంతో తన జుట్టును కడుక్కోవాలని ద్రౌపది ప్రతిజ్ఞ చేసినట్లుగా..ఆప్ ద్రోహాన్ని బయటపెడతానని మలివాల్ గతంలో ప్రతిజ్ఞ చేసింది. లేటెస్ట్ గా కేజ్రీవాల్ ఓటమితో ఆమె మరోసారి పరోక్షంగా విమర్శలు చేశారు.
రావణుడి అహంకారం కూడా ఆయన్ను రక్షించలేకపోయింది. మహాభారతం ఇతిహాసం నుంచి పాండవులు తమ దాయాదుల చేతిలో పందెం వేసి ఓడిపోయిన చిత్రాన్ని ఆమె పోస్ట్ చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలవ్వడం..కేజ్రీవాల్ కూడా ఓడిపోవడంతో.. స్వాతి మలివాల్ చేసిన ప్రతిజ్ఞ నిజమైందనే చర్చ జరుగుతోంది.
— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025