Delhi Results 2025: ఢిల్లీలో కమలం వికసించింది....

Delhi Results 2025: ఢిల్లీలో  కమలం వికసించింది....

ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునే విధంగా ఫలితాలు వస్తున్నాయి.  గత రెండు ఎన్నికల్లో సింగిల్​ డిజిట్​ కే పరిమితమైన కాషాయం.. ఢిల్లీని ఏలుతుందని ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.  వరుసగా మూడుసార్లు ఢిల్లీని శాసించిన ఆప్​ అధికారాన్ని కోల్పోయే స్థితిలో ఉంది. 2013  తరువాత ఢిల్లీలో కాషాయం రెపరెపలాడింది.  27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్​ ఉనికిని కోల్పోయింది.

 దేశ రాజధాని ఢిల్లీలో   27 సంవత్సరాల నిరీక్షణ ముగిసిందని బీజేపీ నేతలు  అంటున్నారు.  ఎర్లీ ట్రెండ్స్​ ఫలితాల్లోనే బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చింది.   న్యూఢిల్లీలోని మూడు సెగ్మంట్లలో కేజ్రీవాల్​ వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. కనీస మెజార్టీ 36 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికే బీజేపీ ఆమార్క్​ను రీచ్​ అయింది. 

  ఫిబ్రవరి 5న ఒకే దశలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60.54 ఓటింగ్ నమోదైంది. బీజేపీ గెలిచే అవకాశాలున్నాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేశాయి.  2013 చివరి నుంచి ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పటి వరకు  బీజేపీ 44  స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆప్ 25  స్థానాల్లో ముందంజలో ఉంది. ఓ చోట కాంగ్రెస్ అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్లీ ట్రెండ్స్ లోనే  బీజేపీలో ఆశలు చిగురించాయి.