ఢిల్లీ రిజల్ట్స్​ ( 9గంటలకు): దూసుకుపోతున్న బీజేపీ.. వెనుకపడ్డ ఆప్​

ఢిల్లీ రిజల్ట్స్​ ( 9గంటలకు):  దూసుకుపోతున్న బీజేపీ.. వెనుకపడ్డ ఆప్​

ఢిల్లీ దంగల్​ అసెంబ్లీ ఫలితాలు లెక్కింపు జరుగుతుంది .( ఉదయం 9 గంటలకు) పోస్టల్​ బ్యాలెట్​లో నువ్వా .. నేనా అన్నట్లు బీజేపీ అప్​ తలపడుతున్నాయి.  ఇప్పటి వరకు ( 9 గంటల వరకు) ఫలితాల సరళిని పరిశీలిస్తే బీజేపీ ముందంజలో ఉంది. అప్​ కు చెందిన కీలకనేతలు కేజ్రీవాల్​.. మనీష్​శిశోడియా..అతిశీ వెనుకంజలో ఉన్నారు.  అయితే ఆప్ నేతలు మాత్రం  అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాత్రం తాము నాలుగోసారి గెలుపు సాధిస్తామని చెబుతున్నారు.

ఫిబ్రవరి 5న ఓటింగ్ తర్వాత, ఈరోజు ( ఫిబ్రవరి 8) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ప్రస్తుతం  ఈవీఎంలో నమోదైన ఓట్లను లెక్కిస్తున్నారు. కౌటింగ్ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ట్రెండ్‌లు క్రమంగా వస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ 36 స్థానాలు గెలుస్తుందో, వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం  బీజేపీ 42.. ఆప్​ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.