![ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..](https://static.v6velugu.com/uploads/2025/02/delhi-elections-2025-57percent-voter-turnout-till-5-pm-claims-of-cash-distribution-voter-fraud-spark-concerns_nOj3GwPeFl.jpg)
దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది..సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమ తించారు. బుధవారం ( ఫిబ్రవరి 5)న సాయంత్రం 5 గంటలకు వరకు 57 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
పోలింగ్ సందర్భంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉద్రికత్త నెలకొంది.. ప్రధాన ప్రత్యర్థులు అయిన ఆప్, బీజేపీ పార్టీల నేతలు రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేశా రు. సీలంపూర్, జంగ్ పురాలో, చిరాగ్ ఢిల్లీలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళ వాతావరణం ఏర్పడింది. కొన్ని చోట్ల ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.
బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 57 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా (52.73 శాతం) పోలింగ్ నమోదైంది. న్యూఢిల్లీ జిల్లాలో అత్యల్పంగా (43.1 శాతం) పోలింగ్ నమోదైంది. ఈశాన్య ఢిల్లీలోని బాబర్‌పూర్ నియోజకవర్గంలో 51.74 శాతం పోలింగ్ నమోదు కాగా..మధ్య ఢిల్లీలోని కరోల్ బాగ్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 39 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.