ఆన్ లైన్ స్కామ్ లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టెలిగ్రామ్, వాట్సాప్ ఫ్లాట్ ఫారమ్ లలో చెలామణి అవుతున్న పెట్టుబడి స్కామ్ ల ద్వారా స్కామర్లు ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన అంకిత్ చౌదరి అనే ఇంజనీర్ టెలిగ్రామ్ స్కామర్ల చేతికి చిక్కి రూ. 12 లక్షలు కోల్పోయాడు.
క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని టెలిగ్రామ్ ద్వారా అంకిత్ చౌదరికి మేసేజ్ వచ్చింది. మొదట రూ. 10వేల పెట్టుబడి పెట్టాడు అంకిత్ చౌదరి. స్కామర్లు అంకిత్ కు నమ్మించేందుకు ప్లాన్ ప్రకారం.. అతనికి రూ. 15 వేలు పంపించారు. దీంతో అంకిత్ చౌదరికి వారిపై నమ్మకం కలిగింది. ఈవిధంగా వారు అగిడినంత పెట్టుబడి పెడుతూ పోయాడు. మొత్తం రూ. 12 లక్షల పెట్టుబడి పెట్టాడు. చివరికి మోసపోయానని తెలుసుకొని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్నర ఢిల్లీ ఈశాన్య జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే.. ఇలా చేయండి
-ఎవరైనా పెట్టుబడి పెట్టాలని మిమ్మల్ని సంప్రదించినప్పుడు ఆ కంపెనీ చట్టబద్దమైనదా లేదా నిర్దారించుకోవాలి
- స్కామర్ల నుంచి వచ్చే మేసేజ్ లలో భాషా పరమైన అసమానతలపై గుర్తించండి.. స్కామర్లు పంపించే మేసేజ్ లలో గ్రామర్, స్పెల్లింగ్ లు ఉంటాయి. వీటి ద్వారా అవి ఫేక్ అని గుర్తించొచ్చు.
- ఆధార్ నంబర్లు, బ్యాంక్ వివరాలు లేదా OTP వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయొద్దు. ఇది మరిన్న సమస్యలకు దారి తీస్తుంది.