ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. తాజాగా వెల్లడైన యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా ఢిల్లీ పీఠంపై బీజేపీదే అధికారమని తేలింది..70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 45 నుంచి 55 స్థానాల్లో గెలుపొంది అధికారం చేజిక్కించుకోనుందని.. ఆప్ 15 నుంచి 25 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని తేల్చింది యాక్సిస్ మై ఇండియా. అయితే.. కాంగ్రెస్ 0 నుంచి ఒక్క స్థానానికి మాత్రమే పరిమితం అవవుతుందని వెల్లడించింది యాక్సిస్ మై ఇండియా.
ALSO READ | దశాబ్దాల ఓబీసీ కోటా కలను నిజం చేశాం: ప్రధాని మోదీ
ఇదిలా ఉండగా.. పొలిటికల్ క్రిటిక్ సర్వే, ఇండియా, కేకే సర్వే మాత్రం ఢిల్లీలో మళ్లీ ఆప్ గెలుస్తుందని తెలిపింది. తమ అంచనాల ప్రకారం ఢిల్లీలో ఆప్ నాలుగోసారి వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించింది. 70 సీట్లున్న ఢిల్లీలో అత్యధికంగా 38 నుంచి 48 సీట్లు వస్తాయని తెలిపింది. దీంతో వరుసగా నాలుగోసారి కూడా ఢిల్లీలో ఆప్ పార్టీదే హవా కొనసాగడం ఖాయమని తేలిపోయింది.