దేశ రాజధానిలో మానవత్వం మంటగలిసింది. సాటి మనిషి రక్తపు మడుగులో కొట్టుకున్నా పట్టించున్న నాథుడే లేడు. పైగా ఆయన ఒక యంగ్ డైరక్టర్ కూడా. ఢిల్లీలో అక్టోబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో యంగ్ డైరక్టక్ పీయూష్ పాల్ ప్రాణాలు కోల్పోయాడు.
కల్కాజీలో నివాసముంటున్న పీయూష్ పాల్ గురుగ్రామ్‌లో ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ( అక్టోబర్ 30) రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. అదే దారిలో వేగంగా వస్తున్న మరో ద్విచక్రవాహనం అతడి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పాల్ సమీపంలోని చెట్టును ఢీకొని గాయపడటం వల్ల తీవ్రరక్త స్రావమైంది. దాదాపు అరగంట పాటు రక్తపు మడుగులో ఉన్న పీయూశ్ను.. ఎవరూ పట్టించుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న పీయూష్‌ను... ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం అవ్వడం వల్ల చికిత్స పొందుతూ పాల్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కొంత సమయం ముందు తీసుకువస్తే బతికే అవకాశం ఉండేదన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీని పరిశీలించి ప్రమాదానికి కారణమైన నిందితుడిని బంటీగా గుర్తించారు.
సమీపంలోని పెట్రోల్ పంప్‌లోని సీసీటీవీలో రికార్డైన వివరాలు ప్రకారం బాధితుడు పీయూష్ పాల్ ను .. బైక్ ఢీ కొనడంతో కిందపడిపోయాడు. పీయూష్ ముఖం.. తలకు బలమైన గాయాలయి... తీవ్ర రక్తస్రావం అయింది. ఇది అతని మరణానికి దారితీసింది. సోమవారం ( అక్టోబర్ 30) రాత్రి 9:30 గంటలకు ఐఐటీ-ఢిల్లీ క్రాసింగ్ నుంచి నెహ్రూ ప్లేస్‌కు వెళ్లే దారిలోని ఔటర్ రింగ్ రోడ్‌లో జరిగింది.
అరగంటకు పైగా పీయూష్ పాల్ గాయపడి రక్తం గాయాలతో .. రోడ్డుపైనే పడి ఉన్నాడు. అటుగా చాలా మంది వెళ్తున్నా .. ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని, చుట్టుపక్కలవారు ఫోటోలు తీస్తున్నారని... ఒక సాక్షి తెలిపారు. అయితే ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత బైక్‌లోని గోప్రో కెమెరా కనిపించకుండా పోయిందని, పీయూష్ మొబైల్ ఫోన్ కూడా కనిపించలేదని పీయూష్ స్నేహితుడు సన్నీ ఆరోపించారు.
పీయూష్ పాల్ స్నేహితుడు సన్నీ తనకు ఆస్పత్రి నుంచి 11:30 గంటలకు సమాచారం వచ్చిందని తెలిపాడు. పీయూష్ పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు చెప్పినట్టు సన్నీ చెప్పారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. పీయూష్ పాల్ బైక్ ను వెనుక నుంచి వేరే బైక్ ఢీకొట్టినట్టు అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డైందని తెలిపారు. పీయూష్‌కు సహాయం చేయడానికి ఆగిన కొద్దిమందిలో ఒకరు చాలా రక్తం పోయిందని చెప్పాడు. ఆ తర్వాత అతడిని ఆటోలో ప్రెస్ ఎన్‌క్లేవ్ మార్గ్‌లోని పీఎస్‌ఆర్‌ఐ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు.పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు జరిగాయి.
ALSO READ :- కొత్త రూల్ : మీ ఇంట్లో కుక్కలు ఉంటే రూ.10 వేలు కట్టండి