న్యూఢిల్లీ: రైలు కిందపడి పై రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి డాక్టర్లు చేతుల మార్పడి ఆపరేషన్ చేసి కొత్త లైఫ్ ఇచ్చారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన డాక్టర్లు ఆరు వారాల తర్వాత అతన్ని గురువారం డిశ్చార్జ్ చేశారు. ఢిల్లీలోని నంగ్లోయ్ కు చెందిన రాజ్‌కుమార్(45) పెయింటర్‌గా పని చేసేవాడు. తన ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్‌ను సైకిల్‌పై దాటుతూ రైలు కింద పడ్డాడు. అతని రెండు చేతులు కోల్పోయాడు.
బాధితుడు తన పర్సనల్ నీడ్స్కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ప్రొస్తెటిక్స్ తో ప్రయత్నించినప్పటికి తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోలేకపోయాడు. దీంతో అతను చేతుల మార్పిడి ఆపరేషన్‌కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే నార్త్ ఇండియాలో ఈ తరహా ఆపరేషన్లు చేయడానికి సర్ గంగా రామ్ హాస్పిటల్ఒక్కదానికి మాత్రమే పర్మిషన్ ఉంది. అది కూడా వారికి గతేడాది ఫిబ్రవరిలో వచ్చింది.
‘‘మేం చేతుల మార్పిడి ఆపరేషన్ కోసం పేషెంట్లను వెతుకుతున్నప్పుడు.. రాజ్ కుమార్ మా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. జనవరి మూడో వారంలో అతనికి కాల్ చేశాం. ట్రాన్స్‌ప్లాంట్ ప్రోటోకాల్స్ ప్రకారం అతనికి టెస్టులు, డిటైల్డ్ఎగ్జామినేషన్ నిర్వహించాం” అని ప్లాస్టిక్, కాస్మెటిక్ సర్జరీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ మహేశ్ మంగళ్ చెప్పారు. ఢిల్లీకి చెందిన ఓ స్కూల్ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ మరణించాక ఆర్గాన్ డొనేషన్స్కీమ్కింద ఆమె అవయవాలను సేకరించాం. జనవరి 19న డాక్టర్ల టీమ్ ఎంతో క్లిష్టమైన ఆపరేషన్‌ను నిర్వహించి రాజ్ కుమార్ కు చేతులు అమర్చినట్లు చెప్పారు. నాడులు, సిరలు, ధమనులు, ఎముకలు, చర్మం ఎంతో నైపుణ్యంలో ఎక్కడా తేడా లేకుండా అతికించినట్లు వెల్లడించారు.