దేన్నీ వదల్లేదు : G20 సమ్మిట్ పూల కుండీలు, వస్తువులు ఎత్తుకెళుతున్న జనం

దేన్నీ వదల్లేదు : G20 సమ్మిట్ పూల కుండీలు, వస్తువులు ఎత్తుకెళుతున్న జనం

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టా్త్మకంగా దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ ను నిర్వహించింది. 20 దేశాధినేతలతో పాటు..ఎంతో మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. ఢిల్లీ పరిసరాల్లో అందమైన పెయింట్స్, రకరకాల మొక్కలను ఏర్పాటు చేసింది. పచ్చని పూలకుండీలను రోడ్లకు ఇరువైపులా పెట్టారు. కానీ జీ20 ముగిసింది. మరి మొక్కలు, పూలకుండీలు ఉన్నాయా..? అంటే ఒక్కటి కూడా లేవు. ఆ పూల కుండీలన్నీ ఏమయ్యాయంటే..అన్నింటిని ప్రజలు ఎత్తుకెళ్లారు. కుండీల్లోని మట్టిని, మొక్కలను రోడ్డుపై పడేసి..ఖాళీ కుండీలను తీసుకెళ్లారు. 

ALSO READ : దమ్మున్నోడికి డిమాండ్ : AI కంటెంట్ కోసం కంపెనీల వెతుకులాట..

సెప్టెంబర్ లో జీ20 సమ్మిట్ కారణంగా ఢిల్లీ పబ్లిక్  వర్క్స్ డిపార్ట్ మెంట్ రోడ్డుకు ఇరు వైపులా సుమారు 1.6 లక్షల పూలకుండీలను, ఇతర మొక్కలను ఏర్పాటు చేసింది. ఈ కుండీలు చోరీ కాకుండా ఉండేందుకు పోలీసులను మోహరించింది. అయితే జీ20 సమ్మిట్ ముగిసిన తర్వాత పోలీసులు కుండీలకు సెక్యూరిటీగా లేకపోవడంతో ప్రజలు..కుండీలను ఎత్తుకెళ్లారు. జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఇతర మండపాల్లోని వస్తువులను దోచుకెళ్లారు. 

జీ20 సమ్మిట్ కోసం  ఢిల్లీ పబ్లిక్  వర్క్స్ డిపార్ట్ మెంట్ హుస్సేన్ మార్గ్, పురానా ఖిలా, మహాత్మా గాంధీ మార్గ్, సచివాలయ రోడ్, మందిర్ మార్గ్, ప్రెస్ ఎన్‌క్లేవ్ మార్గ్, వికాస్ మార్గ్‌లతో సహా కీలకమైన రహదారుల వెంట పూల కుండీలను ఏర్పాటు చేసింది. భారత మండపం ముందు మథుర రోడ్‌లోని కొంత భాగం పచ్చటి జోన్‌గా తీర్చిదిద్దింది.