ఢిల్లీ స్కూళ్లలో ‘దేశభక్తి’ పాఠాలు!

ఢిల్లీ స్కూళ్లలో ‘దేశభక్తి’ పాఠాలు!

దేశంపై భక్తి భావం రోజూ ప్రదర్శించం.ఏడాదిలో ఏ కొద్ది సందర్భాల్లో నో చాటుకుం టాం. సహజంగా రిపబ్లిక్ డే, ఇండిపెం డెన్స్ డే, బాపూజీ బర్త్​ డే.. ఇలా జాతీయ పండుగల రోజున దేశం గొప్పతనాన్ని గుర్తుచేసుకుం టాం. ఈ దేశ భక్తి పాఠాలను ఇకపై స్కూల్ పిల్లలకు నేర్పాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించిం ది. మరో వైపు.. నేచురల్ , ట్రెడి షనల్ సైన్స్ సూత్రాలను, వేదాలను నేషనల్ స్కూల్ కరికులంలో చేర్చాలని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ సూచిస్తోంది.

జాతీయ రాజధాని ఢిల్లీలో మరికొద్ది నెలల్లోఅసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యం -లో.. అక్కడ అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) ప్రభుత్వంఆలోచించి అడుగులేస్తోంది. కేంద్రం లో వరుసగా రెండోసా రి పవర్ నిలబెట్టుకున్న బీజేపీతో ఆప్ ఇటీవల రాజకీయం​గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా జమ్మూకాశ్మీ ర్ కు సంబంధించిన జోడు నిర్ణయాలవిషయంలో మోడీ సర్కార్ ను మెచ్చుకుంది. కానీశాసన సభ ఎన్ని కల్లో బీజేపీ ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తుందోననే బెంగతో కొత్త ఎత్తు వేసింది. జాతీయవాదంపై తమకూ పేటెంట్ హక్కు ఉందని చెప్పే ప్రయత్నం చేసింది. ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో దేశ భక్తిపాఠాలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిం ది.

73వ ‘ఇండిపెండె న్స్ డే’కి ఒక్క రోజు ముందు ఈప్రకటన చేసింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్యా-ట్రియాటిజంపై సిలబస్ ఉంటుందని క్లారిటీ ఇచ్చిం ది.ప్రతి విద్యార్థీ మంచి వ్యక్తిగా, నిజమైన దేశభక్తు డిగాఎదగాలని; తద్వారా వాళ్ల ఫ్యామిలీకి, దేశాభివృద్ధికిపాటుపడాలని కోరుకుంటున్నట్లు ఆప్ చీఫ్ , ఢిల్లీసీఎం​ కేజ్రీవాల్ తెలిపారు. ‘మనం మామూలుగాఇండియా–పాకిస్థా న్ క్రికెట్ మ్యాచ్ రోజున లేదాబోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమేదేశంపై అభిమానం చూపుతాం. డైలీ లైఫ్ లో దేశ-భక్తి ప్రదర్శిం చం. ఓ విధంగా చెప్పా లంటే మిగతారోజుల్లో దేశాన్ని మర్చిపోయి మన గురించే పట్టించు-కుంటాం. ఈ పరిస్థితి మారాలన్నదే మా ఉద్దేశం’ అనిఆయన వివరించారు.

‘భారతమాత’ ప్రస్తావన

సహజంగా భారతమాత అనే మాట బీజేపీ నేతలప్రసంగాల్లోనే ఎక్కు వగా వినిపిస్తుంది. అలాంటిదిఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఆ ప్రస్తావన తెచ్చారు.‘మన పిల్లలు పెద్దోళ్లయ్యా క జాబులు చేసేటప్పుడుగానీ మరే సందర్భంలోనైనా ఎక్కడా లంచం ఇవ్వొ-ద్దు. తీసుకోవద్దు. అసలు ఆ మాటే ఎత్తొద్దు. ఒకవేళఅవినీతికి పాల్పడాల్సి వస్తే భారతమాతను మోసంచేస్తున్నాననే గిల్టీ ఫీలింగ్ కలగాలి. అదనేకాదు. ఏ వి-షయంలోనూ తప్పు చేయకుండా ఉత్తమ పౌరులుగాఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్ ను జంప్ చేసేటప్పుడు మనదేశంలోని రూల్స్ ని మనమే పాటించకపోతే ఎలా?అని వాళ్లు లోలోపల ప్రశ్నించుకోవాలి. దానికోసమేఈ ప్రయత్నం ’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.

వేదాల్లోకి వెళ్దాం

వేదిక్ మ్యాథ్స్ వంటి పాతకాలం సైన్స్ ఈక్వేష న్స్ ని, ఫార్ములాస్ ని దేశవ్యాప్తంగా స్కూల్ కరికులమ్ లో  పెట్టాలని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ కేంద్ర ప్రభుత్వా నికి సూచించిం ది. తద్వారా స్టూ డెంట్స్ ని వేదాల్లోకి, గోల్డెన్ డేస్ లాంటి ఓల్డెన్ డేస్ లోకి, సైన్స్ మూలాల్లోకి తీసు కెళ్లాలని అభిప్రాయపడింది. కొత్తగా తెచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) డ్రాఫ్ట్​ పై హెచ్ ఆర్ డీ మినిస్ట్రీకి ‘శిక్షా సంస్కృతి ఉత్తన్ న్యా స్ ’ (ఎస్ ఎస్ యూఎన్ ) అనే ఆర్గనైజేషన్ ఇలా సలహా ఇచ్చిం ది. హిందూ యోగి స్వామి వివేకానంద, గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ,‘మిసైల్ మ్యాన్ ’ అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల ఫిలాసఫీలను పిల్లలకు చెప్పా లని అభిప్రాయ పడింది. ‘జ్ఞా న్ ఉత్సవ్ 2076’ పేరుతో త్వరలోజరిపే సెమినార్ లో వీటిపై లోతుగా చర్చించనున్నారు. ఈ సదస్సుకు సెంట్రల్ హెచ్ ఆర్ డీ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్ , ఆరెస్సెస్ చీఫ్ మోహత్ భగవత్, యోగా గురు బాబా రామ్ దేవ్ , బాలకృష్ణ హాజరు కానున్నారు. వేదిక్ మ్యాథ్స్ పాఠాలతో స్టూ డెంట్స్ బాగా షార్ప్​గా తయారవుతారని, చిన్నలెక్కలు  చేయటానికి కూడా క్యాలికు లేటర్లపై ఆధారపడాల్సి న అవసరం ఉండబోదని ఆర్గనైజేషన్ సెక్రెటరీ అతుల్ కొఠారి అన్నా రు. పాలసీలో పేర్కొన్న‘రాష్ట్రీయ శిక్షా ఆయోగ్’ ని ప్రధాని బదులు ఎడ్యు-కేష నిస్టులు లీడ్ చేయాలని దేశంలోని అతి పెద్దటీచర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ, మాజీ ఎంపీ శత్రుఘ్న ప్రసాద్ సింగ్ గతంలోనే సూచించారు.

ముఖ్యం గా మూడు లక్ష్యాలు

సిలబస్ లో దేశభక్తి కరికులమ్ పెట్టాలనుకోవటంలో మూడు లక్ష్యాలున్నట్లు కేజ్రీ చెప్పా రు.

  1. ప్రతి స్టూ డెంటూ ముందుగా దేశాన్ని చూసి గర్వపడేలా చేయాలి. దేశం సాధించిన అద్భు త వి జయాలను పాఠాల ద్వారా నేర్చు కోవాలి.
  2. దేశం పట్ల ఏవిధంగా బాధ్యతగా మెలగాలో ప్రతి స్టూ డెంట్ కీ చెప్పాలి . మన దేశ సమస్యలను మనమే పరిష్కరించుకోవాలనే ఆలోచన విద్యార్థుల్లో కలిగించాలి . దేశ సమస్యను తన సమస్యగా భావించేలా, వాటిని ఛాలెంజ్ గా తీసుకొని సొల్యూషన్ కనిపెట్టేలా స్టూ డెంట్స్ ని తీర్చిదిద్దాలి .
  3. దేశం కోసం ఏ త్యాగానికైనా ఎప్పుడైనా రెడీ అనేలా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి