నిన్న ఒక్కరోజే 6 లక్షల మందికి భోజనమందించిన ఢిల్లీ ప్రభుత్వం
లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం అందించింది. గురువారం ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ భోజనాన్ని సుమారు 6 లక్షల మంది పేదలు ఉపయోగించుకున్నారు. ‘మేం రోజూ 3.5 లక్షల నుంచి 4 లక్షల మందికి ఆహారం అందిస్తన్నాం. అయితే ఆహార కేంద్రాలలో ప్రజల రద్దీ దృష్ట్యా శుక్రవారం నుంచి 10 నుంచి 12 లక్షల మందికి ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
గురువారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ అంతటా 1,423 ఆహార కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా మధ్యాహ్నం 5,85,386 మందికి.. రాత్రి 5, 79,162 మందికి భోజనం అందించింది.
వితంతు పింఛను పథకం కింద ఉన్న 2.5 లక్షల మందికి, వృద్ధాప్య పెన్షన్ పథకం కింద ఉన్న 5 లక్షల మందికి, అంగ వైకల్యం పెన్షన్ పథకం కింద ఉన్న లక్ష మందికి ఇచ్చే పెన్షన్లను డబుల్ చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
భారతదేశంలో ఇప్పటివరకు 2,543 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదుకాగా.. అందులో 2280 కేసులు ఆక్టివ్ గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా భారిన పడి 191 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 72 మంది మరణించారు.
For More News..