మంటలను ఆర్పేందుకు రోబోలు

అగ్ని ప్రమాద మంటలను ఆర్పడానికి, తగ్గించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రత్యేక చొరవకు పూనుకుంది. ఇరుకైన సందులు, గిడ్డంగులు, అడవులు, రసాయన ట్యాంకర్లు, కర్మాగారాల్లో ఎగసిపడే మంటలను ఆర్పేందుకు రెండు రోబోలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు దిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఇక ఈ రిమోటెడ్ రోబోట్స్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే ఇరుకైన దారులను కూడా నావిగేట్ చేయగలవు. మానవులకు అందుబాటులో లేని ప్రదేశాలను సైతం చేరుకోని ప్రమాదాన్ని తీవ్రతరం కాకుండా ఎదుర్కోగలవు.

ఈ సందర్భంగా ఢిల్లీ హోం మంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ, '' మంటలను నియంత్రించే సామర్థ్యం ఉన్న రిమోట్ కంట్రోల్ రోబోలను మొదటిసారిగా దేశంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం, ఢిల్లీ ప్రభుత్వం అలాంటి 2 రోబోలను ప్రవేశపెట్టింది. ఈ ట్రయల్ విజయవంతమైతే, అలాంటి మరిన్ని రోబోలు నౌకాదళంలోకి ప్రవేశించబడతాయి. ఈ రిమోట్-నియంత్రిత రోబోలు అగ్నిమాపక సిబ్బందికి ప్రధాన ట్రబుల్ షూటర్లుగా ఉపయోగిమవుతాయని చెప్పారు