ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత JEE, NEET కోచింగ్

ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత JEE, NEET కోచింగ్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు NEET,JEE (CUET) పరీక్షలకు ఉచిత కోచింగ్ ప్రవేశపెట్టింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం,NDMC (న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) ఒప్పందం కుదుర్చుకుంది. 1.63 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు NEET ,CUET కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించేందుకు BIG ఇన్‌స్టిట్యూట్‌తో ఢిల్లీ NCT ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ (DoE) అవగాహన ఒప్పందం (MoU)పై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ,విద్యా మంత్రి ఆశిష్ సూద్ సమక్షంలో ఒప్పందం జరిగింది. 

ఏప్రిల్ 2 నుంచి మే 2, 2025 వరకు ప్రతిరోజూ ఆరు గంటల పాటు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తారు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణితం, జనరల్ ఆప్టిట్యూడ్ ,ఆంగ్లాన్ని సమగ్రంగా కవర్ చేస్తారు. అదనంగా రివిజన్ కోసం మెటీరియల్,  క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తారు. 

Also Read :- ఆ కంపెనీలో 49 శాతం వాటాలు కొంటున్న ఎల్ఐసీ

మరోవైపు ఢిల్లీ పాఠశాల విద్యార్థులకు త్వరలో పాఠ్యాంశాల్లో వృద్ధుల సంరక్షణ, యోగా, కృత్రిమ మేధస్సు (AI), సెల్ఫ్ హెల్ప్  వంటి కొత్త అంశాలను చేర్చనున్నారు. సైన్స్ ఆఫ్ లివింగ్ అనే కొత్త కోర్సును ప్రవేశపెట్టనున్నారు. ఈ కోర్సును విద్యార్థులకు యోగా, మైండ్‌ఫుల్‌నెస్ , వ్యాయామాలతో సహా వివిధ రకాల ధ్యానాలను నేర్పించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు SCERT అధికారి తెలిపారు. 

ఈ కోర్సు కిండర్ గార్టెన్ నుంచి10వ తరగతి వరకు విద్యార్థులకు అమలు చేస్తారు. మానసిక శ్రేయస్సు , భావోద్వేగ మేధస్సును పెంపొందించడానికి అవసరమైన నైపుణ్యాలను వారికి ఈ కోర్సు ద్వారా అందించనున్నారు. అదనంగా, ఆధునిక టెక్నాలజీ డెవలప్ మెంట్ కు సంబంధించిన విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండేలా AI కొత్త కోర్సులను అందిస్తోంది.