మళ్లీ గెలిపిస్తే.. మహిళలకు నెలకు రూ.2,100.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ హామీ

మళ్లీ గెలిపిస్తే.. మహిళలకు నెలకు రూ.2,100.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ హామీ

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే.. ఢిల్లీ మహిళలకు ప్రతి నెలా రూ. 2,100 ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు రూ.1000 ఇచ్చేందుకు ఢిల్లీ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపిందన్నారు. తమను మళ్లీ గెలిపిస్తే ఈ మొత్తాన్ని రూ.2,100కు పెంచుతామన్నారు. ఈ సందర్భంగా  కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. “నేను ప్రతి మహిళకు వెయ్యి ఇస్తానని గతంలో ఇచ్చిన హామీని ఇప్పుడు నిలబెట్టుకున్నాను. ఎన్నికల్లో గెలిపిస్తే ఇప్పుడు ఇచ్చిన హామీలనూ నెరవేరుస్తా” అని తెలిపారు.