కాసేపైతే తాళి కట్టేవాడు.. చోలీకే పీచే క్యాహే పాటకు డ్యాన్స్ చేశాడు.. ఆ తర్వాత పెద్ద ట్విస్ట్ ..

కాసేపైతే తాళి కట్టేవాడు.. చోలీకే పీచే క్యాహే పాటకు డ్యాన్స్ చేశాడు.. ఆ తర్వాత పెద్ద ట్విస్ట్ ..

ఇండియాలో పెళ్లి అంటేనే గానా బజానా.. డ్రమ్స్.. డీజే మోతలకు డ్యాన్సులు చేయకుండా పెళ్లిళ్లు దాదాపు జరగవు. ఇప్పుడైతే పెళ్లి చేసుకోబోయే కపుల్ కూడా డ్యాన్స్ చేయడం కామన్ అయిపోయింది. అలా చేస్తేనే ఆ ఫంక్షన్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. కానీ ఒక పెళ్లి కుమారునికి పెళ్లిలో ఫ్రెండ్స్ తో కలిసి నాలుగు స్టెప్పులెయ్యడమే శాపం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీలో జనవరి 16న ఓ పెళ్లిలో జరిగింది ఈ వింత ఘటన. పెళ్లి రోజు ఫంక్షన్ హాల్ అంతా చుట్టాలతో సందడిగా మారిన టైమ్ లో.. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. డ్రమ్స్ వాయిస్తుంటే డ్యాన్స్ చేస్తూ.. పెళ్లికొడుకును కూడా నాలుగు స్టెప్పులెయ్యమని అడిగారట. ఫ్రెండ్స్ కోరికను కాదనలేక.. డ్యాన్స్ చేస్తూ మండపంలోకి వచ్చాడు పెళ్లి కొడుకు. అది చూసీ చుట్టాలు, కుటుంబ సభ్యులు కూడా చాలా ఎంజాయ్ చేశారట. పెళ్లంటే ఇంత సందడిగా ఉండాలని హ్యాపీగా ఫీలయ్యారట. అంతలోనే పెళ్లికొడుకుకు పెద్ద షాకిచ్చారు అమ్మాయి ఫ్యామిలీ వాళ్లు. 

పెళ్లి కుమారుడు డ్యాన్స్ చేయడం పెళ్లి కూతురు తండ్రికి నచ్చలేదంట. వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేసేశాడంట ఆ పెద్ద మనిషి. పెళ్లి కొడుకు అలా డ్యాన్స్ చేయడం వలన తమ కుటుంబ విలువలు దెబ్బతిన్నాయని, చాలా పద్ధతి గల కుటుంబ తమది.. ఇలాంటి అల్లరి చిల్లర డ్యాన్సులు భరించలేమని చెప్పేశాడట. 

తన తండ్రి నిర్ణయానికి షాకైన పెళ్లి కూతురు కన్నీరు మున్నీరైందట. చుట్టాలు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అతను వినలేదట. చివరికి పెళ్లి కొడుకు స్వయంగా వెళ్లి బతిమాలినా లాభం లేకపోయింది. తమది పరువు, మర్యాద గల కుటుంబం.. దీన్ని మేము సంహించేదిలేదని చెప్పి పెళ్లి రద్దు చేశాడట. 

ఈ ఘటనకు సంబంధించిన వార్తను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు అక్కడున్న వ్యక్తి. ‘‘చోలీకే పీచే క్యాహే.. గ్రూమ్ ఆఫ్ ద ఇయర్.. ఈ సారి డ్యాన్స్ చేసే అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకో బ్రో.. పెళ్లి కూతురు తండ్రికి మ్యూజిక్ ఫోబియా ఉన్నట్లుంది..’’ లాంటి కామెంట్లతో వైరల్ అయ్యింది ఈ ఇన్సిడెంట్. డ్యాన్స్ ఒక్కటే కారణం కాదు.. ఇంకేదో ఉంది పెళ్లి క్యాన్సిల్ కావడం వెనుక అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా డ్యాన్స్ చేశాడని పెళ్లి రద్దు చేసుకోవాలనుకుంటే ఈ రోజుల్లో దాదాపు 90 శాతం పెళ్లిళ్లు క్యాన్సిల్ అయిపోతాయి కావచ్చు.