స్టూడెంట్స్ మొబైల్ఫోన్ల వాడకంపై నిషేధం సాధ్యం కాదు: ఢిల్లీ హైకోర్టు

స్టూడెంట్స్ మొబైల్ఫోన్ల వాడకంపై నిషేధం సాధ్యం కాదు: ఢిల్లీ హైకోర్టు

ఇటీవల కాలంలో పిల్లలు, విద్యార్థులు మొబైల్ ఫోన్ల వాడకంలో పేరెంట్స్ ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అటు డాక్టర్లు, ఇటు మానసిక నిపుణులు కూ డా మొబైల్ ఫోన్ల వాడకంతో భవిష్యతులో వారికి ఎదురయ్యే ప్రమాదాలు, నష్టాల గురించి హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులు కూడా మొబైల్ ఫోన్ల వాడకంపై కీలక సూచనలు, ఆదేశాలు జారీచేస్తున్నాయి. ఇటీవల స్కూళ్లలో విద్యార్థులు సెల్ ఫోన్ల వాడకంపై ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కీలక సూచనలు  చేసింది. 

ALSO READ | పాస్ పోర్ట్ రూల్స్ మారాయ్.. ఇక నుంచి పాస్ పోర్ట్ కావాలంటే ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే..!

సోమవారం ( మార్చి 3) స్కూళ్లలో విద్యార్థులు సెల్ఫోన్ వాడకం నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారించింది.అధికంగా సెల్ఫోన్లన్ల వాడకం చాలా ప్రమాదకరమే.. అయితే భద్రత,తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ వంటి అంశాల్లో వాటి ప్రాధాన్యత ఎంతో ఉంది..ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో విద్యార్థులు సెల్ఫోన్ల న్లు వాడకుండా నిషేధించలేమని కోర్టు స్పష్టం చేసింది. 

విద్యార్థులు సెల్ఫోన్ల వినియోగాన్ని నియంత్రించడంలో చేపట్టే చర్యల అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. విద్యార్థులు మొబైల్ ఫోన్లు దుర్వినియోగం చేయకుండా అవసరమైన ప్రయోజనాలకోసం ఫోన్లను తీసుకెళ్లేందుకు అనుమతించడం, పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన ప్రాధాన్యతను జస్టిస్ అనుప్ జైరామ్ భంబానీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఢిల్లీలోని ద్వారకలో ఓ కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి విద్యార్థి స్మార్ట్ ఫోన్ దుర్వినియోగం చేసినందుకు తరగతులు, పరీక్షలు రాయకుండా నిషేధించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ కేసులో విద్యార్థిని మరో బ్రాంచికి బదిలీ చేయాలని..పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్ వినియోగంపై గైడ్ లైన్స్ రూపొందించాలని కోర్టు తీర్పునిచ్చింది.