మనీష్ సిసోడియాకు షాక్.. మళ్లీ బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు 2023 జులై 03  సోమవారం రోజున కొట్టివేసింది . ఈ దశలో సిసోడియాకు బెయిల్‌ ఇచ్చే అర్హత లేదని పేర్కొంటూ జస్టిస్ దినేష్ కుమార్ శర్మ నిరాకరించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వ్యాపారవేత్తలు అభిషేక్ బోయిన్‌పల్లి, బెనోయ్ బాబు, విజయ్ నాయర్‌ల బెయిల్ పిటిషన్‌లను కూడా హైకోర్టు కొట్టివేసింది.

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవకతవకలు జరిగాయని  మనీష్ సిసోడియాను సీబీఐ 2023 ఫిబ్రవరి 26న ఆరెస్ట్  చేసింది. ఈ క్రమంలో బెయిల్ కోసం ఆయన పలుమార్లు ధరఖాస్తు పెట్టుకున్న ఆయనకు నిరాశే ఎదురువుతుంది. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి కావున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేస్తున్నారు. తాజాగా హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగలింది.

ALSO READ:హర్యానా ప్రభుత్వం కొత్త స్కీమ్ ... పెళ్లికాని వారికి పెన్షన్

కాగా  ఢిల్లీ ప్రభుత్వం 2021నవంబర్ 17న లిక్కర్ స్కామ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది, అయితే అవినీతి ఆరోపణల కారణంగా 2022 సెప్టెంబర్ చివరిలో దానిని రద్దు చేసింది.