దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV), ఇతర శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కునేందుకు గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది.
ఆస్పత్రులకు వచ్చే ప్రతీ ఒక్కరి వివరాలు తీసుకోవాలని.. ఆదేశించింది వైద్యఆరోగ్యశాఖ. ప్రతీ పేషెంట్ డేటాను భద్రపరచాలని సూచించింది. ఆసుపత్రులు తప్పనిసరిగా IHIP పోర్టల్ ద్వారా ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI) , తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) కేసులను రిపోర్ట్ చేయాలని సూచించింది.
ఆస్పత్రికి వచ్చిన వారిలో ఎవరైనా హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలుంటే వారికి ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ చేయాలని సూచించింది. ట్రేస్ చేయడానికి లక్షణాలున్న వ్యక్తి డాక్యుమెంట్స్ భద్రపరచాలని సూచించింది.
ALSO READ | గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా మరో వైరస్ కేసు.. ఇండియాలో మూడుకు చేరిన HMPV కేసులు
IHIP పోర్టల్ ద్వారా హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలున్న కేసులను గుర్తించి వారికి అవసరమైన మందులను అందించాలని సూచించారు అధికారులు . ఆసుపత్రులలో అదనంగా పారాసెటమాల్, యాంటిహిస్టామైన్‌లు, బ్రోంకోడైలేటర్లు, దగ్గు సిరప్‌లు , తేలికపాటి కేసులకు చికిత్స చేయడానికి ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
దేశ వ్యాప్తంగా మూడు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే..బెంగళూరులో ఇద్దరు,అహ్మదాబాద్ లో ఒకరికి హెచ్ఎంపీవీ సోకింది. బెంగళూరులో మూడు నెలల ఆడశిశువుకు, 8 నెలల బాబుకు వైరస్ సోకింది. వీళ్లకు ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు.