హల్దీరామ్ బ్రాండ్ పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 'హల్దీరామ్' బ్రాండ్ గుర్తు బాగా ప్రసిద్ధి గాంచిందిగా ప్రకటించింది. జస్టిస్ ప్రతిభా సింగ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. “ప్రసిద్ధ గుర్తు హల్దీరామ్స్ బ్రాండ్ ను 'డైనమిక్' అని అభిప్రాయపడింది. ఒక ప్రసిద్ధ గుర్తు కేవలం భౌగోళిక పరిమితులకు మించి విశిష్టత, నాణ్యత యొక్క హామీతో ఉత్పత్తులను నింపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
తన ఉత్పత్తులను కేవలం ఆసియాలోనే కాకుండా ఇతర ఖండాలకు ఎగుమతి చేస్తుంది. రాజస్థాన్ తో మొదలై నేడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. వినియోగదారులకు కంపెనీకి మధ్య నమ్మకాన్ని కాపాడటం ఒక ట్రేడ్ కు ఉండాల్సిన లక్షణమని అది హల్దీరామ్ విశ్వసించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. ట్రేడ్ మార్క్స్ చట్టం కింద హల్దీరామ్ సుప్రసిద్ధులుగా ప్రకటించింది కోర్టు.
తమ కంపెనీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని హల్దీరామ్ సంస్థ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హల్దీరామ్‌కు నష్టపరిహారంగా రూ. 50 లక్షలు, ఖర్చు కింద రూ. 2 లక్షలు ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది. హల్దీరామ్ తన ఉత్పత్తులను ఇతర మోసపూరితమైన మార్కుల క్రింద విక్రయించకుండా తీర్ప ఇవ్వాలని కోర్టును కోరింది.'హల్దీరామ్' బ్రాండ్, "భారతదేశపు సుసంపన్నమైన పాక సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయిన" బ్రాండ్, భారతదేశంలో ఉనికిని ఏర్పరచుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని విస్తరించిందని కోర్టు పేర్కొంది.