న్యూఢిల్లీ: మాజీ ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఐఏఎస్‌కు ఎంపిక అయ్యేందుకు అధికారులను మోసగించే విధంగా ఆమె చర్యలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ చంద్ర ధరి సింగ్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. ఓబీసీ, దివ్యాంగ కోటాలో లబ్ధి పొంది పూజా ఖేడ్కర్ యూపీఎస్సీని తప్పుదోవ పట్టించినట్టు జస్టిస్ చంద్ర ధరి సింగ్ పేర్కొన్నారు.